‘కారు‘ దిగుతాడేమోనని కక్ష సాధింపా..?

దమ్మపేట జనవరి 4 నిజం న్యూస్:
నాలుగున్నరేళ్ల తన ఆవేదనను చెబితేనే అధికార పీఠాలు కదులుతున్నాయి. పొంగులేటిపై ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. పార్టీ మారుతాడేమో..! తమకు ప్రత్యర్థి అవుతాడేమో..! అనే ఆందోళన కొందరికి వణుకు పుట్టిస్తోంది. ఆ భయం తాలూకు ప్రతి చర్యలు కనిపిస్తున్నాయి. పొంగులేటి భద్రతను కుదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శీనన్న గట్టిగా మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవడం రివాజుగా మారింది. గతంలో పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి తొలగించారు. ఇప్పుడు భద్రతను కుదించారు. అధికార మదాన్ని ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో పొంగులేటి సహాయంతో ఈరోజు అధికారం వెలగబెడుతున్న వారు కూడా ఆయనపై దుష్ట చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం శాశ్వతం కాదు.. ఆత్మీయత, అభిమానం ముందు అవన్నీ దిగదుడిపే..! జన నేతను ఎవరూ ఏమి చేయలేరు. భద్రత కుదించినంతమాత్రాన పొంగులేటికి వచ్చిన ముప్పేమీ లేదు. ఆయనను కంటికి రెప్పలా కాపాడుకొనే అభిమానులు వేలు, లక్షల్లో ఉన్నారు. ప్రజల దీవెనలు..దేవుడి దయ ఉన్నంతకాలం పొంగులేటిపై కుయుక్తులేవీ ఫలించవు. ప్రజలే ఆయనకు శ్రీరామరక్ష ఉంటాయని దమ్మపేట పొంగులేటి అభిమానులు భావాలు వ్యక్తపరుస్తున్నారు.