మాడ్గుల మండల సర్వసభ్య సమావేశం బహిష్కరించి సర్పంచ్ ల నిరసన

ఎంపీటీసీల మద్దతుతో సర్పంచుల నిరసన మాడ్గుల జనవరి 4( నిజం న్యూస్): మాడ్గుల మండల సర్వసభ్య సమావేశం రైతు వేదిక భవనంలో ఎంపీపీ పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభంలోనే ప్రతిపక్ష పార్టీ సర్పంచులతో పాటు అధికార పార్టీ సర్పంచులు, ఎంపీటీసీల మద్దతుతో 15వ, ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు లేకుండా, సమాచార ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా మండల ఎంపీఒ వేజన్న నిధులు డ్రా చేసి ట్రాక్టర్ ఇఎంఐ లు చెల్లించడంతో సర్పంచులు అసహనానికి గురై సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీల మద్దతుతో బహిష్కరించి వెళ్ళి పోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొత్త పాండు గౌడు, పులి కంటి లక్ష్మి, తుమ్మ సౌమ్య, నారమ్మ, సర్పంచులు పులికంటి లక్ష్మయ్య, అంబళ్ళ జంగయ్య, కసిరెడ్డి యాదిరెడ్డి, గొర్రె రవీందర్ రెడ్డి, స్వప్న, మండల అభివృద్ధి అధికారి రాఘవులు, ఎంపీ ఓ వేజన్న, మండల విద్యాధికారిసర్దార్ నాయక్, పశువైద్య అధికారి డాక్టర్ శేఖర్, ఇర్విన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రఘురాం, విద్యుత్ శాఖ ఏడి, ఏఈ మిషన్ భగీరథ ఏడి, ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.