Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గుజరాత్ లో కేవలం 6 గంటలే కరెంటు

అన్నారం గ్రామం నుండి బి ఆర్ఎస్ లో ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరికలు

జడ్పీ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి, డిసెంబర్ 4 నిజం న్యూస్

గుజరాత్ లో కేవలం 6 గంటల కరెంటు ఇస్తే ,తెలంగాణలో 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు ముఖ్యమంత్రి కెసిఆర్ పంపిణీ చేస్తున్నారని తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దేవుని గుట్ట తండాలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి, అనంతరం తుంగతుర్తి తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సుమారు 62 చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసి, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో టిఎల్ఎం మేళ సందర్శించారు, 20 లక్షల వ్యయంతో నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నారం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది బి ఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజల ప్రయోజనాలు దుష్ట రైతులకు రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, దళిత బంధు వంటి పథకాలు దేశంలోనే పేరుగాంచిన అని నేడు ఎంతో మంది యువత ఈ పథకాలతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. కాలేశ్వరం ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి పూర్తిస్థాయిలో, సాగునీరు అవకాశం కల్పించారని అన్నారు. దీంతో ఈ ప్రాంత రైతుల ఫలాలు పచ్చగా సస్యశ్యామలమయ్యాయి అన్నారు. అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమంతా అండగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీటీసీ చెరుకు సృజన పరమేష్, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ కటకం వెంకటేశ్వర్లు గుండ గాని రాములు గౌడ్, దొంగరి శ్రీను, సర్పంచులు. వీరోజి, వెంకన్న నాయక్, నల్లు రామచంద్రారెడ్డి, పులుసు. యాదగిరి, కటకం సూరయ్య, ముత్యాల వెంకన్న, డాక్టర్ వైన్ .చారి, డిప్ల నాయక్, ఎల్లబోయిన బిక్షం, పులుసు వెంకటనారాయణ గౌడ్, తాసిల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.