Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

50 వేల మెజార్టీ కాదు.. 50 వేల ఓట్లు తెచ్చుకో..చాలు

ఈనెల 6న కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి

హుజూర్ నగర్ నియోకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..

ఈ నెల 6న హుజూర్ నగర్ కి రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడానికి హెలికాప్టర్ ద్వారా హుజూర్ నగర్ కు చేరుకుని

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని, అనంతరం 11 గంటలకు భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్నట్టు తెలిపారు. తాను

ఎమ్మెల్యే గా గెలిచిన దగ్గరి నుంచి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నానని,

హుజూర్ నగర్ ను అభివృద్ధి చేయడానికి గాడిద కాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్దంమన్నారు

ఉత్తమ్ కు వయసు పెరుగుతున్న కొద్దీ సహనం కోల్పోతున్నారని,  ఆయన రాజకీయ సన్యాసం చేయడం కాదు..ప్రజలే ఆయనకి సన్యాసం ఇచ్చేలా ఉన్నారన్నారు.

2019లో ఎంపీ గా గెలవడమే అతని చివరి గెలుపని,

ఇకపై 50వేల ఓట్లు మెజారిటీ సంగతి దేవుడు ఎరుగు…

ముందు 50 వేల ఓట్లు తెచ్చుకో చాలన్నారు. ఉత్తమ్ ఎప్పుడు

ఏ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారో కూడా అతనికి కూడా అవగాహన లేదని,

ఉత్తమ్ ను చూసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే సిగ్గుతో తల దించుకుంటున్నారు

ఆయన విమర్శలతో కాలం గడుపుతున్నారు మేము అభివృద్ధితో కాలం గడుపుతున్నాం. ఆయనకి మాకు చాలా తేడా ఉందని అన్నారు..