టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన అనపర్తి జ్ఞాన సుందర్

హైదరాబాద్ డిసెంబర్ 4 నిజం న్యూస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుముల. రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్ఞాన సుందర్. పార్టీ లో కొన్ని అభిప్రాయాలు భేదాలు ఉన్న అవన్ని తొలగిపోతాయి. కాలం గొప్పది ఎంతటి బలమైన గాయమైన చికిత్స చేసి నయం చేస్తుంది. ప్రేమ క్షమ త్యాగం ఉన్న క్షమిస్తారు. అందరి ప్రేమను పొందుతారు.
మానవుని శరీర నిర్మాణంలో రెండు రకాల క్రిములు ఘర్షణ పడుతుంటాయి. ఒక రకం ఆరోగ్యం పెంచేందుకు దోహదం చేస్తాయి.మరో రకం ఆరోగ్యం తుంచేందు కృషిచేస్తాయి. రెండు రకాల క్రిములలో ఏ ఒక్కటి శక్తి ఎక్కువ అయిన మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అపుడు ఆరోగ్యం కొరకు డాక్టర్ ను సంప్రదించి వైద్యం చేసుకుంటాం.
ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ కూడా అదే. పంచాయికంటే ప్రాణం (పార్టీ) ముఖ్యం కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చికిత్స ప్రారంచించింది. శరీరం నిర్మాణం లో ప్రతీ పార్ట్ ముఖ్యమైనదే. పార్టీ లో ప్రతి నాయకుడు ముఖ్యమే అందరు కలుస్తారు. కాంగ్రస్ ను గెలిపిస్తారు . కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు.