సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో జనవరి 03 (నిజం న్యూస్)
సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే.
భారత దేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని *సీపీఐ ఆదిలాబాద్ జిల్లా సహయకర్యదర్శి సిర్ర దేవేందర్ పేర్కొన్నారు
మంగళవారం నాడు స్థానిక సీపీఐ జిల్లా కార్యక్రమంలో AIYF ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మేస్రం భాస్కర్ తో కలసి సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడటం జరిగింది