చికిత్స పొందుతూ మృతి చెందిన వివాహిత

ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 3 (నిజం న్యూస్)
హిప్నెల్లి గ్రామానికి చెందిన సింగ్నెవరే శివలీల అలియాస్ రాజ్యశ్రీ వయసు 19 సం కు 5 నెలల క్రితం విట్టొలి గ్రామానికి చెందిన సింగ్నెవరే సాయినాథ్ తో వివాహం జరిగింది .అయితే అట్టి వివాహం ఇష్టం లేని తను తేదీ 31.12.2022 నాడు గుర్తు తెలియని పురుగుల మందు తాగగా నిజామాబాదు హోప్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఆమె తండ్రి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ తిరుపతి తెలియజేసారు