నాస్తికుడైనా రెంజర్ల రాజేష్ ను వెంటనే అరెస్టు చేయాలని గ్రామస్తుల డిమాండ్

బాసరలోని శివాజీ చౌక్లో నిరసన
రెండు గంటలు మూడు కిలోమీటర్లు నిలిచిన వాహనాలు
ముధోల్నియోజకవర్గం ప్రతినిధి జనవరి 3(నిజం న్యూస్)
సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిని శ్లోకం పై రెంజర్ల రాజేష్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యల వలన బాసర గ్రామస్తులు సోమవారం నిరసన వ్యక్తము చేసారు. ప్రసిద్ధ క్షేత్రం బాసర ఆలయం వద్ద ప్రధాన ప్రధాన ద్వారం ముందు అర్చక సిబ్బంది తో కలసి ఆలయ సిబ్బంది నిరసన మరియు ఆటో యూనియన్ ఆలయ 4వ తరగతి ఉద్యోగులు వివిధ పార్టీ నాయకులు బాసర గ్రామ సర్పంచ్ లక్ష్మణరావు ,బిజెపి ,టిఆర్ఎస్ కాంగ్రెస్ వివిధ సంఘ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని స్థానిక శివాజీ చౌక్ వద్ద అందరూ ఏకంగా కలిసి దాదాపు రెండు గంటలపాటు నిరసనలు తెలుపగా ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి జిల్లా కలెక్టర్ ఎస్పీ వచ్చేవరకు గ్రామస్తులు భీష్మించారు అనంతరం బాసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దుకానాలు, వ్యాపార సంఘాలు, పాఠశాల లు స్వచంద బంద్ ను పాటించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారి పై మూడు కిలో మీటర్ల మేర ఆగిన వాహనాలు ట్రాఫిక్ అంతరాయం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లా అండ్ ఆర్డర్ కు సహకరించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేసిన ముధోల్ సీ ఐ వినోద్, బాసర ఎస్సై మహేష్. కలెక్టర్ లేదా ఎస్పి రావాలని పట్టుబట్టిన గ్రామస్తులు రెంజర్ల aరాజేష్ ని 24 గంటల్లో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని డిమాండ్. చేయగా బాసర-భైంసా ప్రధాన రహదారి పై రెంజర్ల రాజేష్ దిష్టి బొమ్మ దహనం చేశారు అనంతరం ముధోల్ సిఐ వినోద్ రెడ్డి బాసర ఎస్ఐ మహేష్ కలిసి రాజేష్ రేంజర్లపై 153,154 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు