జీవితంపై విరక్తి చెంది ఊరి వేసుకొని ప్రాణం తీసుకున్న యువకుడు

ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 3 (నిజం న్యూస్)
ముధోల్ మండల కేంద్రంలోని కొలిగల్లి కి చెందిన భారమొల్ల గణేష్, 19 సంవత్సరాలు చెట్టుకు ఊరి వేసుకొని చనిపోయాడు. గణేష్ తమ్ముడు యోగేష్ కథనం ప్రకారం సోమవారం సాయంత్రం 7.30 కు వారి పొలానికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లి రాకపోయేసరికి మంగళవారం రోజున ఉదయం పొలం కు వెళ్లి చూడగా వారి పొలం లోని బొబ్బిలి చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయి వున్నాడు.బాగా రోజుల నుండి తాగుడుకు బానిసై జీవితం పై విరక్తి చెందినట్లుగా తండ్రి హన్మండ్లు తెలియజేసారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ తిరుపతి తెలియజేసారు.