విద్యార్థులు చదివే లక్ష్యంతో శ్రమించాలి

సూర్యాపేట జనవరి 3 నిజం న్యూస్
సూర్యాపేట డిఎస్పి నాగభూషణం.
విద్యార్థులకు చదివే లక్ష్యం తో శ్రమించి ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం అన్నారు.
మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లో భాగంగా గురుకులాను సందర్శించి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు., విద్యార్థులతో మమేకమై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఒక ప్రక్క చదువులో మరొక ప్రక్క క్రీడారంగంలో రాణించాలని కోరారు. ప్రతి విద్యార్థిని సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తక పఠన లో రాణించాలని కోరారు. పాఠశాలలో ప్రక్క విద్యార్థులు చెడు భావనలో ఉన్నప్పుడు గుర్తించి సంబంధిత అధ్యాపకులకు తెలియజేయాలని కోరారు.
అనంతరం గురుకులం ఆర్ సి ఓ లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థుల కష్టపడి మంచి మార్కులు సాధించాలని కోరారు పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపి, ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి, తుదిరిపోటును గురుకులం ఉన్నత అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై డానియల్ కుమార్, ప్రిన్సిపాల్ దుర్గాభవాని, తాసిల్దార్ రాంప్రసాద్, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు