మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం

ఈనెల 6వతారీఖున రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి ల హుజూర్నగర్ నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేద్దామని హుజూర్నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి పిలుపునిచ్చారు ఈరోజు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు హుజూర్నగర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి అధ్యక్షతన హుజూర్నగర్ మండల పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కే ఎల్ ఎన్ రెడ్డి మార్కెట్ చైర్మన్ కడియం వెంకటరెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గెలిచిన తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో 3500 కోట్ల రూపాయల తో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు ఈనెల ఆరో తారీఖున రాష్ట్ర మంత్రులు కేటీఆర్ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా సుమారుగా 200 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను కూడా మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరిష్కరించడం జరిగిందన్నారు హుజూర్నగర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి మంత్రి కేటీఆర్ సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేలా ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నబి సర్పంచులు అంజిరెడ్డి సైదులు సైదేశ్వర రావు ఎంపీటీసీలు రాజారావు రైతు సమన్వయ సమితి సభ్యులు వీరభద్రరావు పిఎసిఎస్ చైర్మన్ అన్నెం శౌరి రెడ్డి మండల నాయకులు రామయ్య లింగారెడ్డి నరసింహారావు సుందరయ్య వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు హుస్సేన్ గండు సైదులు ముజీబ్ కృష్ణమోహన్ శ్రీను నాగేశ్వరరావు బిక్షం హనుమారెడ్డి మున్నీరు జానీమియా