ఇందిరా పార్క్ ధర్నా కు బయలు దేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అమానుషం

ఆలేరు జనవరి 2 (నిజం న్యూస్)
సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పిటిసిల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం నాడు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇందిరాపార్క్ ధర్నా కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గం నుండి బయలు దేరిన వెళుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయడం అమానుషం అని ఆలేరు కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు ఎం. ఏ. ఏజాస్ అన్నారు. అరెస్ట్ చేసిన వారిలో ఆలేరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ఏ ఎజాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ,ఒకటో వార్డు కౌన్సిలర్ చింతల పాణి సునీత శ్రీనివాస్ రెడ్డి మరియు సింగిల్ విండో డైరెక్టర్ కట్టే గుమ్ముల సాగర్ రెడ్డి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లెపు ఉప్పలయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎగ్గిడి యాదగిరి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కలకుట్ల లోకేష్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాసుల భాస్కర్,జాలపు మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.