ఆలేరు ప్రెస్ క్లబ్ నిర్మాణ కమిటీ అధ్యక్షునిగా ఎం.డి. కుర్షిద్ పాషా ఏకగ్రీవంగా ఎన్నిక

ఆలేరు జనవరి 2 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రెస్ క్లబ్ నిర్మాణ కమిటీ అధ్యక్షునిగా ఎండి కుర్షిద్ పాషా ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సోమవారం జరిగిన సమావేశంలో ఆలేరు ప్రెస్ క్లబ్ నిర్మాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హనుమకొండ ఉపేంద్ర చారి,గౌరవ అధ్యక్షులుగా తోట మల్లయ్య, తిరునగరి శ్రీనివాస్,ఎర్ర జాన్సన్,జూకంటి అనిల్ ను ఎన్నుకోగా, ప్రెస్ క్లబ్ నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులుగా దాసి శంకర్, పి.మాధవరెడ్డి, దూడల సాగర్, కుళ్ళ సిద్ధులు, బోడ నరేష్ ఎర్రోజు రాజు, ప్రధాన కార్యదర్శిగా ఆరె.భాను ప్రసాద్ కొరుటూరి ఉపేందర్, సహాయ కార్యదర్శిలుగా సిరిగిరి స్వామి, సీసా సాయిరాం, సామల సిద్ధులు,కోశాధికారి గుండు మహేందర్,కార్యవర్గ సభ్యులుగా యేలగల కుమారస్వామి,బైరి విశ్వనాథం,ఎం. రవికుమార్, బి,శ్రీకాంత్, ఆరే.సాయి, మంచాన మల్లేశం, గౌరవ సలహాదారుగా మొరిగాడి మహేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులుగా పోతుగంటి సంపత్ కుమార్,చింతకింది వెంకటేశ్వర్లు, చింతకింది కృష్ణ, గంగాధరి శ్రవణ్ కుమార్,ఎండి జహంగీర్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.