నిరుపేద కుటుంబాలకు నిలువెత్తు ధైర్యం కెసిఆర్

-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
యాచారం జనవరి 2 (నిజం న్యూస్)
యాచారం మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు 52,06,032/- రూపాయల విలువ చేసిన కళ్యాణలక్ష్మీ – షాదిముబారక్ చెక్కులను & 19మంది లబ్దిదారులకు 6,64,000/- రూపాయల విలువ చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు చేయించి అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు నిలువెత్తు ధైర్యం మన నాయకులు, సీఎం అని, ఇప్పటివరకు మండలంలోని 1,674 మంది 16,75,94,184/- రూపాయలు కల్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పిటిసి జంగమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, తహశీల్దార్ సుచరిత తదితరులు పాల్గొన్నారు.