గిరిజన గురుకులం మైనర్ బాలిక పై లైంగిక దాడి, ఫోక్సో, కేసు నమోదు!

గురుకులంలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వయసున్న ప్రిన్సిపాల్ దుర్గ భవాని తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్.
తుంగతుర్తి డిసెంబర్ 2 నిజం న్యూస్
తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసి గాయపరిచిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది….
తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సూర్య పేట లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన, బాలిక గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నది, అదే కాలనీకి చెందిన ఒంటెద్దు నాగేందర్, అమ్మాయితో పరిచయం పెంచుకొని, ప్రేమించానని మాయ మాటలు చెప్పి, ఆదివారం రాత్రి తుంగతుర్తి గిరిజన గురుకుల పాఠశాలకు వచ్చి, బయటకు రమ్మని బెదిరించి, చనిపోతానని చెప్పి, మైనర్ బాలికను బయటకు తీసుకువెళ్లి, లైంగిక దాడి చేసి, గాయపరిచాడు. దీనితో ఆ బాలిక అక్కడినుండి గురుకులం కు వెళ్లి, తన మిత్రులతో, ప్రిన్సిపాల్ దుర్గ భవాని తో చెప్పగా, జరిగిన సంఘటన కాలిక తల్లిదండ్రులకు తెలియజేసి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా, బాలికను సూర్యాపేటకు తీసుకువెళ్లి విచారణ జరిపించి, నాగేందర్ పై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు, ఎస్సై తెలిపారు. ఏది ఏమైనా గురుకులంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణితోనే, బాలిక బయటకు వెళ్ళుటకు కారణమైందని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.