పలుగుల మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషిచేయాలి

తుర్కపల్లి, జనవరి 01(నిజం న్యూస్) :
తుర్కపల్లి మండలం వాసాలమర్రి పరిధిలో మహిమ గల పలుగుల మైసమ్మ తల్లి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది కొత్త సంవత్సరం జనవరి మొదటి రోజు కావడం తో భక్తులు పెద్ద ఎత్తున్న దర్శనం చేసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి,ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు…ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక సమావేశయ్యారు ఈ సమావేశంలో నెల రోజుల హుండీ ఆదాయం లెక్కించారు.ఈ నెల ఆదాయం 19324 రూపాయలు వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పలుగుల మహేందర్,రజిని కుమార్,మధు,మల్లేష్,రమణ,ప్రేమ్ చందర్,లింగయ్య,వెంకటేష్, దేవందర్,భుజంగం తదితరులు పాల్గొన్నారు.