కార్మెల్ ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు

-పాల్గొన్న సర్పంచ్ శైలజాగిరెడ్డి మహిళా అధ్యక్షురాలు దేవర సమత వెంకట్ రెడ్డి*
చేవెళ్ల,జనవరి01(నిజం న్యూస్)
చేవెళ్ల మండల కేంద్రంలోని మౌంట్ కార్మెల్ ప్రార్ధన మందిరంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శైలజ ఆగి రెడ్డి, మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సమతా రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బురాన్ సురేష్, మౌంట్ కార్మెల్ సంఘ పెద్దలు బ్రదర్ రామచంద్రయ్య, బ్రదర్ క్రీస్తు దాసు, బ్రదర్ మోజెస్, బ్రదర్ గిద్యోను. మరియు కర్నూల్ సంఘము యొక్క సేవకులు ప్రభుదాసు గారు, పాల్గొనడం జరిగింది. అలాగే మౌంట్ కార్మెల్ ప్రేయర్ హౌస్ యూత్ సభ్యులు; కుమార్, పద్మారావు, బురాన్ సురేందర్ ,విజయ్, సామ్సంగ్ సుశాంత్ విజయరాజ్ బ్రదర్ సత్యం బ్రదర్ కృష్ణ ,బ్రదర్ హగ్గాయ్, కార్మెల్ యూత్ సంఘం నాయకులు పాల్గొన్నారు.