కవాడి చంద్రశేఖర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజేత ఆలూరు

-విజేత జట్టుకు 50 వేల,రన్నరప్ 25 వేల రూపాయలు*
చేవెళ్ల,జనవరి01(నిజం న్యూస్)
చేవెళ్ల మండల కేంద్రంలో గత నెల రోజులుగా కెవిఆర్ గ్రౌండ్లో కవాడీ చంద్రశేఖర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ టోర్నమెంట్లో చేవెళ్ల ,ఆలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో అన్ని విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలూరు జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టుకు 50 వేల రూపాయలు రన్నరప్ జట్టుకు 25 వేల రూపాయలు టోర్నమెంట్ ఫైనల్ కు అతిదులుగా వచ్చిన చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పిటిసి మాలతి, సర్పంచ్ శైలజ ఎస్సై ప్రదీప్, బురాన్ ప్రభాకర్, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, సమతా రెడ్డి వాళ్ళ చేతుల మీదుగా ట్రోఫీని మరియు చెక్కును విజేతలకు అందజేశారు.
ఈకార్యక్రమం ఉద్దేశించి వారు మాట్లాడుతూ… సమాజంలో యువత టెక్నాలజీ వైపు దూసుకెళ్తుంటే క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరకదృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందించడంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఉపసర్పంచ్ గంగి యాదయ్య గవర్నమెంట్ నిర్వాహకులు బండారి శ్రీకాంత్ రెడ్డి, టిల్లు ,అశ్విన్ కుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మల్లేష్ ,శ్రీరామ్ రెడ్డి, లైక్, గోపాల్ రెడ్డి ,అత్తిలి అనంతరెడ్డి, భాగిరెడ్డి,తిరుపతిరెడ్డి, రాజ వర్ధన్, రఘుపతి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.