అండర్ డ్రైనేజ్ గుంతతో రాకపోకలు బంద్

– నేల రోజులు అయిన పూర్తి కాని డ్రైనేజ్ నిర్మాణ పనులు
– త్వరగా పనులు పూర్తి చేయలంటున్నా ప్రజలు
రంగారెడ్డి జిల్లా బ్యూరో జనవరి,1(నిజం న్యూస్): ఇబ్రహింపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయం వద్ద కల్వర్టు, డ్రైనేజీ పైప్ లైన్ గుంత సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నెలరోజుల కిందట డ్రైనేజీ పైప్ లైన్ కోసం తీసిన గుంతను పూడ్చకుండా వదిలి వేశారు. దింతో స్థానికులతో పాటు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కార్ లు, ఆటోలు, దిచక్రవాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. నేల రోజులు గడుస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులకు వారి సమస్య పట్టడం లేదు. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరగడం లేదు
– గూడెం శ్రీనివాస్
అధికారుల నిర్లక్ష్యంతోనే అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తి కావడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానితో గ్రామంలోకి రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పిందన్నారు నేల రోజులు గడుస్తున్న నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో రాకపోకలు బందు కావడంతో ప్రజలకు అసౌకర్యంగా మారిందన్నారు ఇప్పటికైనా అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలన్నారు
అండర్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
– కంబాలపల్లి వెంకటేష్
పోల్కంపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజ్ కొసం తీసిన గుంతతో అటు వైపు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి దీని వల్ల ప్రజలకు ఇబ్బందిగా మారింది అదికారులు స్పందించి వేంటేనే డ్రైనేజ్ సమస్యను పరిష్కరించి ప్రజలు పడుతున్నా ఇబ్బందులను తీర్చాలి