Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెరాస పార్టీ మనకు ఎంత గౌరవం ఇచ్చిందో చూశాం…పొంగులేటి

ఛలో ఖమ్మంకు కార్లతో పోటెత్తిన ప్రజానీకం

మందలపల్లి నుంచి ఖమ్మం వరకు కార్లతో కిక్కిరిసిన రోడ్లు

ప్రతి కార్ పైన పొంగులేటి చిత్రపటాలు

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పొంగులేటి

సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తా – పొంగులేటి

శ్రినన్నను కలవటానికి 20 నుంచి 30 వేలకు పైగా వచ్చిన అభిమానులు

నాతో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల బరిలో ఉంటారు – పొంగులేటి

దమ్మపేట జనవరి 1 నిజం న్యూస్:

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం నుంచి భారీ నుంచి అతి భారీ కార్లతో ర్యాలీగా పొంగులేటి అభిమానులు వెళ్ళారు. ప్రతి కారు పైన పొంగులేటి శీనన్న చిత్రపటాన్ని అంటించారు.

దాదాపుగా ఖమ్మం వెళ్లే హైవే రోడ్డు శీనన్న కలవడానికి వెళ్లే అభిమానుల కార్లతో కిక్కిరిసిపోయింది. శీనన్న అభిమానులు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అనంతరం కేక్ కట్ చేశారు. ఆ సమయంలో భారత రాష్ట్ర సమితి మనకు ఏ విధమైన గౌరవం ఇచ్చిందో మనకందరికీ తెలుసు, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరిస్తానని, నాతో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలలో బరిలో ఉంటారని, ఈ వేదిక పైన ఉన్న ప్రజా ధారణ…ప్రజల ప్రేమను కలిగిన ముఖ్య నాయకులను రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా గెలిపించి తీరుతానని, ముందు ముందు మంచి రోజులు రానున్నాయని, సమయం వచ్చినప్పుడు మీ దీవెనలతో….మీ ఆశీర్వాదంతో…. మీరు ఏదైతే కోరుకుంటున్నారో కోరుకునేది తప్పకుండా చేసి చూపిస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ ముఖంగా తెలిపారు.ఈ కార్యక్రమానికి దమ్మపేట నుంచి వెళ్లిన ముఖ్య నాయకులలో అశ్వారావుపేట నియోజవర్గ నాయకులు జారి ఆదినారాయణ పార్వతనేని ప్రసాద్,రావు గంగాధరరావు,కోటగిరి సత్యంబాబు, ఎర్రగోర్లరాధాకృష్ణ,సాయిల నర్సి,రావి రవిశంకర్ పండు,చిన్న శెట్టి యుగంధర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.