సమస్యల పరిష్కారాని కై నిరసన కార్యక్రమాలు

*టియుడబ్ల్యూజే (ఐజేయు) సభ్యులు…*
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో డిసెంబర్ 31 (నిజం న్యూస్)
నిర్మల్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డుతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరి, ఇళ్ల స్థలాల మంజూరు కొరకు జనవరి 2 సోమవారం రోజున జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు యూనియన్ సభ్యులు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట, డివిజన్ కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట, జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో నిరసన కార్యక్రమాలను తెలిపి అనంతరం ఆయా కార్యాలయాలలో వినతి పత్రాలను సమర్పించాలని జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ , ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్యలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, కార్యదర్శి సట్ల హన్మాండ్లు, అసోసియేట్ కార్యదర్శి రషీద్ అలం, కార్యవర్గ సభ్యులు అమీన్ పటేల్, మోసిన్ బిన్ మహమ్మద్, అబ్దుల్ ఆజాం, జహీర్ అస్మి, అజాముద్దీన్, శేషగిరి రాజు, భోజన్న తదితరులు పాల్గొన్నారు.