విజయవంతమైన టిఎల్ఎం మేళా

మాడుగుల డిసెంబర్ 31( నిజం న్యూస్):
చదువులో వెనకబడిన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తరగతి గదులలో బోధనోపకరణాల ప్రదర్శనతో విద్యార్థులకు ప్రయోజనం చేసేందుకే టీ ఎల్ ఎం మేళా కార్యక్రమాలను మండలాల వారిగా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డిఇఓ సుసింధర్ రావు అన్నారు. శనివారం మాడుగుల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులచే నిర్వహించే టీఎల్ఎం మేళ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సుసింధర్ రావు స్థానిక ఇన్చార్జి ఎంఈఓ సర్దార్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల మనుసుతో విద్యను బోధించినప్పుడు వాళ్లు చాలా చక్కగా రాణిస్తారు అని జిల్లా అధికారి తెలియజేశారు. మండలంలోని 40 పాఠశాలలకు చెందిన మూడు కాంప్లెక్స్ ల పరిధిలో టి ఎల్ ఎం మేళ నిర్వహించామని అత్యుత్తమంగా రాణించిన 12 మంది ఉపాధ్యాయులను గుర్తించి జిల్లాకు పంపించనున్నట్లు.ఎంఈఓ సర్దార్ నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు గౌరవరం పద్మా రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కోర్ర శంకర్ నాయక్, గ్రామ సర్పంచ్ అంబల్ల జంగయ్య గౌడ్, మండల ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి శ్యాంసుందర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామానుజన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాములు, చందులాల్, భాస్కర్ రెడ్డి లావణ్య సంఘ నాయకులు టి వెంకట్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, దేవయ్య, రాజేశ్వర్ రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పూల్ సింగ్, విద్యార్థులు పాల్గొన్నారు.