యువజన కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అమానుషం

బంగారు తెలంగాణలో పోలీసుల రాజ్యమేనా నని నాయకుల ఆవేదన.
తుంగతుర్తి డిసెంబర్ 31 నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ లో జరుగుతున్న అవకతవకలపై తెలంగాణ యువజన కాంగ్రెస్ శనివారం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది దీనిలో భాగంగా తుంగతుర్తిలో యువజన కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారనే ముందస్తు సమాచారంతో తెల్లవారుజామునే వారిని తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్ అదుపులోకి తీసుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యువజన పక్షాన పోరాడితే జైల్లో పెడతారా ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని అన్నారు
ఈ కార్యక్రమంలో కొండరాజు, వీరబోయిన గంగరాజు, ఎస్కే సయ్యద్, వీరబోయిన రంగన్న, ఉప్పుల రాంబాబు, ఎలమ య్యాకయ్య తదితరులను అరెస్టు చేయడం జరిగింది