రాజీవ్ సహకారం… మల్లె పాక శ్వేతకు ఆపన్నహస్తం

మల్లెపాక శ్వేత 4 సంవత్సరాల చదువును… తానే భరిస్తానన్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్.
25 వేలు ఆర్థిక సాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు ఈ ప్రాంత ప్రజలు హర్షం!
హైదరాబాద్ డిసెంబర్ 30 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తన స్వగ్రామమైన వెలుగుపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న చదువుల తల్లికి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆపన్న హస్తం అందించారు….
వెలుగుపల్లి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లెపాక రాములు కూతురు, మల్లెపాక శ్వేతకు టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు లభించింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు తన కూతురు కాలేజ్ హాస్టల్ ఫీజు కట్టలేక పోయాడు. దీంతో ఈ విషయం రాజీవ్ సాగర్ దృష్టికి రాగా శ్వేత హాస్టల్ ఫీజు 4సంవత్సరాలు తానే కడతానని హామీ ఇచ్చారు. చెప్పడంతో పాటు ,శ్వేతకు ఏడాదికి అయ్యే హాస్టల్ ఫీజు రూ. 25 వేలను హైదరాబాద్ లోని తన కార్యాలయంలో అందజేశారు. అలాగే తన పూర్తయ్యే వరకు అండగా ఉంటానని రాజీవ్ సాగర్ విద్యార్థినికి భరోసా ఇచ్చారు.
బాగా చదివి ఇంజనీరింగ్ లో రాణించి ఊరి పేరు నిలబెట్టాలని అమ్మాయికి సూచించారు. ఈ సందర్భంగా శ్వేత కుటుంబసభ్యులు రాజీవ్ సాగర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా వెలుగు పెళ్లి ముద్దుబిడ్డ ఉద్యమ నాయకుడు పేద విద్యార్థిని పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల వెలుగు పల్లి గ్రామస్తులు, ఈ ప్రాంత ప్రజలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పిఆర్టియు జనరల్ సెక్రటరీ ధర్మారపు వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మల్లెపాక రాములు, వెలుగుపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గుడిపాటి కమలాకర్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ మల్లెపాక యాదగిరి పాల్గొన్నారు.