మామ పాడె మోసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ డిసెంబర్ 30 నిజం న్యూస్
ఇన్నాళ్లు నవ్వుతూ నవ్విస్తూ అందరిని నడిపించే నాయకుడిగానే అందరికి తెల్సు అతను….
తండ్రి తర్వాత తండ్రిలాంటి మామ , కోల్పోయిన మంత్రి కేటీఆర్ , తీవ్ర విషాదంలో ఉండి, ఆసుపత్రి నుంచి మొదలుకుని అంత్యక్రియల వరకు అన్ని తానై నడిపించడం అక్కడున్న వారందరిని కలచివేసింది.
స్వయంగా తాను ఒక సామాన్యుడిలా ఆసుపత్రి నుంచి తన మామ పార్థివదేహాన్ని అంబులెన్స్ లో తీసుకురావడం. తండ్రి భౌతికకాయాన్ని చూసి బోరున విలపిస్తున్న సతీమణి శైలిమ, పిల్లలు హిమాన్షు, అలేఖ్యను ఓదార్చుతూ, అంత్యక్రియ కార్యక్రమాలను స్వయంగా తానే పర్యవేక్షించి, తన కొడుకుతో కలిసి పాడె మోయడం చూసిన స్థానికులు, బంధాలకు తాను ఇస్తున్న విలువలను చర్చించుకున్నారు. ఏది ఏమైనా మామకు తగిన అల్లుడు, ఓ సామాన్యునిగా, మంత్రిగా కేటీఆర్ రావడం గమనార్వం.