తల్లి కూతురు ఆత్మహత్యయత్నం… తల్లి మృతి

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో డిసెంబర్ 29 (నిజం న్యూస్)
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో విషాదం నెలకొంది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకోగా తల్లి మృతి చెందగా ఇద్దరు కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని
రెడ్డి కాలనిలో నివాసం ఉంటున్న వేదశ్రీ అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుకొని, తన ఇద్దరు కృతుళ్ళు ప్రజ్ఞ, వెన్నెల లపై సైతం కిరోసిన్ పోసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఘటన స్థలంలోనే తల్లి వేదశ్రీ
మృతిచెందగా, ఇద్దరు కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఇద్దరు కూతుళ్లు కూడా రాత్రి 8:30 నిమిషాలకు రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు