మిర్చి కల్లాలకు ఇసుకకు అనుమతి ఇవ్వాలని రైతుల వినతి

చర్ల డిసెంబర్ 28 (నిజం న్యూస్) మండలంలోని రైతుల మిర్చి కళ్ళల్లోకి ఇసుకకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాసిల్దారు బి భరణి బాబుకు బుధవారం రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొసరాజు కుమార్ రాజా.ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మిర్చి కోతులు ప్రారంభం అయ్యాయని అని ఇసుకకు అనుమతి ఇవ్వాలని కోరారు ఈసందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం అనుమతి లేకుండా ఇసుక మట్టి గ్రావెల్ అక్రమ రవాణా చేస్తే ముందస్తు సమాచారం లేకుండానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటనలు వెల్లడించామని అన్నారు రైతులకు ఇసుక అవసరం విందనిఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన ఆదేశాల మేరకు రైతులకు ఎంత అయితే అవసరమందో కూపన్ ద్వారా అనుమతి ఇస్తామని రైతులకు వివరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రైతులు గొడవర్తి మురళి. రాట్నాల శ్రీరామ్మూర్తి. గొడవర్తి బలరామకృష్ణ. శీలం శ్రీనివాసరావు. కుప్పాల ప్రవీణ్. గుడిపాటి రామకృష్ణ. పోలిశెట్టి వినోద్. ఉప్పలపాటి రామకృష్ణ. మేడిచర్ల కుమార్. పాల్గొన్నారు