కౌతాళం మండలం సంక్షేమానికి లోటు లేదు ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి

కౌతాళం డిసెంబర్28* *(నిజం న్యూస్)*:-
; కౌతాళం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో *ఎమ్మెల్యే. వై.బాలనాగిరెడ్డి దాట్ల కృష్ణంరాజు దేశాయి ప్రహ్లాద ఆచారి* చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబ్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పథకాలు అమలు చేశారు.వైఎస్సార్సీ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలనలో విద్యార్థులకు సముచిత స్థానం ఏర్పాటు చేసిందని చెప్పడం జరిగింది.అలాగే విద్యార్థి అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాడాలని ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులకు ట్యాబ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ప్రతి యొక్క వెసులుబాటును విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఈ మండలానికి మంచి పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో,ఎంపీపీ అమ్రేష్ ,వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, పాఠశాల చైర్మన్ వడ్డె రాము, గురు రాఘవేంద్ర రెడ్డి, సర్పంచ్ పాల్ దివాకర్, ఉప సర్పంచ్ తిక్కయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు