ప్రమాద బాధితుడికి అండగా..మంత్రి జగదీష్ రెడ్డి

అమాత్యుడి ఔదార్యం,ప్రమాద బాధితుడికి మంత్రి నే అండగా
*నడుం విరిగి మంచానికే పరిమిత మైన పరిస్థితికి చలించిన మంత్రి* ..
*చికిత్స బాధ్యత ను భుజాన వేసుకున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.
*సత్వర వైద్య సహాయం కోసం ఆదేశాలు… ఏది చేసిన ఓ ప్రత్యేకత.
*బాధితుడి ఆరోగ్య పరిస్థితి పై స్వయంగా వ్యక్తిగత వైద్యుల తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి*
*నేనున్నానంటూ బాధిత కుటుంబానికి భరోసా*
సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్ 27 నిజం న్యూస్
సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమై బాధపడుతున్న బాధితుడి తో పాటు అయన కుటుంభ సభ్యులకు అభయ హస్తం అందించారు. ఆర్థిక కష్టాలతో వైద్యం చేయించలేకపోతున్న పేద కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఆత్మకూర్ ఎస్ మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ జానికిరాములు, భవన నిర్మాణ కార్మికుడు గా పని చేసేవాడు.. విధి నిర్వహణలో ప్రమాధవశాత్తు క్రింద పడటం తో రెండు కాళ్లు , వెన్నెముక విరగడం తో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అతని కుటుంభం ఒక్కసారిగా రోడ్డున పడింది..దిక్కుర్ తోచని స్థితిలో ఉన్న జానికిరాములు కుటుంభ పరిస్తితి గురించి ఈ రోజు గ్రామానికి వెళ్ళిన మంత్రి జగదీష్ రెడ్డి చేవిన పడింది.. వెంటనే స్పందించిన మంత్రి జానికి రాములు ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.. వెంటనే హైదరాబాద్ లోని వైద్య బృందానికి కాల్ చేసి ఫోన్ లోనే జానికీ రాములు ఆరోగ్య పరిస్తితి ని స్వయంగా వివరించడం తో పాటు, జానికి రాములు కోలుకునే విధంగా వెంటనే ఉన్నత వైద్యం అందించాలని కోరారు.. దానికి అవసరమయ్యే ఖర్చుల బాధ్యత తనదే అని తెలిపారు.. కుటుంభ సభ్యుల కు కూడా మీకు నేను ఉన్నాను అధైర్య పడవద్ధని బరోసా ఇచ్చారు.. తమ కుటుంబ పరిస్తితి గురించి తెలుసుకుని దేవుడిలా మాకు అండగా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డి మా కుటుంభం ఎన్నటికీ రుణ పడి ఉంటామని జానీకి రాములు కుటుంభ సభ్యులు, బందువులు, నేతలు తెలిపారు..