Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

-కాంగ్రెస్ నాయకుడు కావలి వెంకటేష్ బాబు*

చేవెళ్ల,డిసెంబర్24(నిజం న్యూస్)

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకుడు కావలి వెంకటేష్ బాబు క్రైస్తవ సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ మేలు,శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని అభిలషించారు. అంతారం గ్రామంలో ఉన్న అన్ని మతాలను,కులాలను సమానంగా గౌరవిస్తూ అన్ని పండుగలు ఘనంగా జరుపుకోవలన్నారు.క్రైస్తవులు ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆయన తెలిపారు.