డాక్టర్ల నిర్లక్ష్యం – కన్నతల్లి కి శోకం.

పసిబిడ్డ మృతి చెందడంతో ఆగ్రహించిన ప్రజా సంఘాలు….
యదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో డిసెంబర్ 21(నిజం న్యూస్ )
తొమ్మిది మాసాలు బిడ్డను మోసిన అమ్మ, ఆ బిడ్డకు జన్మనిచ్చి బాధనంతా మరచిపోదామనుకున్న ఆ తల్లికి,ఆ ఆశ ఆవిరైపోయింది.గర్భ శోకమే మిగిలింది..జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కన్న బిడ్డకు దూరమైన ఆ కన్నతల్లి శోక సంద్రంలో మునిగిపోయింది…..వివరాల్లోకి వెళితే భువనగిరి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం మండల పరిధిలోని హన్మాపూర్ గ్రామానికి చెందిన తోటకూరి మాధవి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆసుపత్రి కి వచ్చింది..ఆసుపత్రి సిబ్బంది మాధవి ని పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి, మరళ నొప్పులు వేస్తే ఆసుపత్రి కి రమ్మని చెప్పి ఇంటికి పంపారు.అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో పురిటి నొప్పులు అధికం కావడం తో మాధవిని,ఆమె భర్త తోటకూరి రమేష్, ఆశావర్కర్ ప్రమీల సాయంతో తిరిగి ఆసుపత్రి కి తీసుకువచ్చారు..ఆసుపత్రి సిబ్బంది మాధవి ని ఆసుపత్రిలో చేర్చుకొని వైద్య సేవలు అందించారు..సహజ డెలివరీ కోసమని,ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతోబుధవారం ఉదయం పాపం ఉమ్మినీరు అధికంగా తాగడం వల్ల గుండె కొట్టుకోవడం లేదని,ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని డాక్టర్ చెప్పడంతో మాధవి బందువులు ఆసుపత్రి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు..పాప పరిస్థితి బాగాలేకుంటే ఆపరేషన్ చేయాలి లేదా పెద్దాసుపత్రి కి పంపించాలి..ఏమీ చెప్పకుండా వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పి,పూర్తిగా డాక్టర్ నిర్మల మేడం నిర్లక్ష్యం చేయడంతో మా పాప చనిపోయిందని మాధవి భర్త రమేష్, బందువులు ఆరోపిస్తున్నారు..పేషెంట్లు ఎక్కువగా ఉన్న కారణంగా మాధవిని సరిగా పట్టించుకోకపోవడం వల్లే,పాప ఉమ్మి నీరు తాగి మృతి చెందినట్లు మాధవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.డాక్టర్ నిర్మల మేడం నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు..ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అధికంగా జరగాలని అధికారులు కోరుతున్నా,డాక్టర్ల కొరత,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే భయపడుతున్నారనేది నగ్న సత్యం……. ఆసుపత్రి పనితీరు పై ప్రజా సంఘాల ఆగ్రహం.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పేదలకు సక్రమంగా అందడం లేదని, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పసి పిల్లల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్,నేషనల్ హూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఎం డి ఇంతియాజ్ లు ఆరోపించారు..ప్రభుత్వ డాక్టర్లు విధులను విస్మరించి,ప్రైవేటు ప్రాక్టీస్ పై శ్రద్ధ చూపుతున్నారని, వైద్యం వ్యాపారం గా మారిందని వారన్నారు. తోటకూరి మాధవి కి సరియైన వైద్యం అందించి ఉంటే, ఆమె పసి బిడ్డ బతికేవాడని,పిల్లల పై నిర్లక్ష్యం వహిస్తే డాక్టర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని వారు హెచ్చరించారు..జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందేటట్టు చూడాలని వారు కోరారు..పసి బిడ్డ ను కోల్పోయిన తోటకూరి మాధవికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.