Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్యాసినో ఆటలో పడి… హర్షవర్ధన్ రెడ్డి 92 లక్షల మాయం

ఆటోలో కూరుకుపోవడంతో… రోడ్డున పడుతున్న కుటుంబాలు.

హర్షవర్ధన్ రెడ్డి గత నాలుగు నెలలుగా ఆటాడి 92 లక్షల పోగొట్టుకున్నాడు.

మాయా సెల్ఫోన్లతో.. మాయా ఆటలతో.. నరకం చూస్తున్న యువత.

యువత బాగోగులు…. తల్లిదండ్రులదే…

సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు… పట్టించుకోని యువత.

హైదరాబాద్, డిసెంబర్ 21 నిజ న్యూస్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సీతారాంపురం గ్రామంలోసెల్ ఫోన్లో క్యాసినో ఆడి, కుర్రాడి నిర్వాకం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది …

 

భూసేకరణ కింద ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 92 లక్షలు పోగొట్టాడు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చన్ వల్లి శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు వ్యవసాయమే వారికి జీవనాధారం. పెద్ద కుమారుడు శ్రీపాల్ రెడ్డి నగరంలో బీటెక్ చదువుతున్నాడు చిన్న కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి నిజాం కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శ్రీనివాస్ రెడ్డికి గ్రామంలో 10 ఎకరాల భూమి ఉంది ఇటీవల ప్రభుత్వం టీఎస్ ఐఐసీకి ఆ భూములను అప్పగించింది. భూసేకరణ కింద ఎకరాకు 10 లక్షల 50 వేలు చొప్పున పరిహారం ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి దాదాపు కోటి ఐదు లక్షలు వచ్చింది ఈ సొమ్ముతో శ్రీనివాస్ రెడ్డి శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద అరెకర భూమిని కొనుగోలు చేసేందుకు 70 లక్షలు ఒకరితో బేరం కుదుర్చుకున్నాడు అడ్వాన్సుగా 20 లక్షలు చెల్లించారు. మిగతా 85 లక్షల తండ్రి శ్రీనివాస్ రెడ్డి తల్లి విజయలక్ష్మి బ్యాంకు ఖాతాల్లో 42 లక్షల 50 వేలు చొప్పున జమ చేశారు ఫోన్లో కింగ్ 567 క్యాసినో పేరుతో ఆన్లైన్ గేమ్ ఆడుతున్న హర్షవర్ధన్ రెడ్డి, పరిహారంగా వచ్చిన డబ్బు విషయం తెలుసుకున్నాడు. కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి యజమానికి డబ్బు ఇస్తానంటూ హర్షవర్ధన్ తన తండ్రి ఖాతాలోని 42 లక్షల 50వేల తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు తల్లి దగ్గర ఇదే విషయాన్ని చెప్పడంతో ఆమె బ్యాంకు ఖాతాలోని 42 లక్షల 50 వేలను విత్డ్రా చేయించి ఇంట్లో ఉంచింది హర్షవర్ధన్ ఆన్లైన్ గేమ్ ఆడుతూ తన ఖాతాలోని 42 లక్షల 50 వేలను దఫాలుగా పోగొట్టుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఆ తరువాత ఇంట్లో ఉంచిన సొమ్మును తన అకౌంట్లో పలుమార్లు డిపాజిట్ చేసుకొని ఆటలో కోల్పోయాడు. డబ్బు గురించి అడగ్గా ఆన్లైన్ గేమ్ లో ఆడి పోగొట్టినట్లు ఇంట్లో వాళ్లకు తెలిపాడు అతను గ్రామంలోని మరొకరి వద్ద ఏడు లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తుంది సెప్టెంబర్ నుంచి మొత్తం 92 లక్షలు పోగొట్టుకున్నాడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కుమారుడు ఇలా చేసినట్లు తెలుస్తోంది.