వాలంటీర్లు సేవాభావంతో తో పనిచేయాలి….అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

యదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో డిసెంబర్ 21(నిజం న్యూస్)
భారత్ దేఖో స్వచ్చంద సంస్థ సహకారంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో
జిల్లా లోని వాలంటీర్లకు తొలిమెట్టు పై రెండు రోజుల అవగాహన కార్యక్రమం భువనగిరి మునిసిపల్ సమావేశ మందిరంలో జరిగిన ముగింపు సమావేశములో ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5 వ తరగతి విద్యార్థులకు అభ్యసన సామర్థ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం నిర్వహిస్తున్న “తొలిమెట్టు” లో వాలంటీర్లు సేవాభావంతో భాగస్వామ్యం అవుతున్నందుకు వారిని అభినందించారు. విద్యార్థులలో కనీస సామర్ధ్యాలు పెరిగే దిశగా అని చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు..కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి , భారత్ దేఖో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రోమిలా, అభిజిత్, సెక్టోరియల్ అధికారులు ఆండాలు, శ్రీనివాస్, నవభారత్ యూత్ కోఆర్డినేటర్ కరుణ్ పాల్గొన్నారు.