ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కొప్పుల మోహన్ రెడ్డి

అడ్డగుడూర్ డిసెంబర్ 19(నిజం న్యూస్)
తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో అడ్డగూడూర్ మండల పరిధిలో జానకిపురం చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కొప్పుల మోహన్ రెడ్డి, నాయకులు నానుబోతు కుమార్, యాదగిరి, బాణాల నరేష్, అంబటి శోభన్ బాబు, చింత సుధాకర్ వారితో పాటు 200 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సోమవారం తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కొప్పుల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ నియోజజవర్గానికి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డగుడూర్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్య, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మోత్కూర్ మాజీ మార్కెట్ కమిటీ చిప్పలపల్లి మహేంద్రనాధ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూలపల్లి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మందుల కిరణ్, బాలెంల మధు, తదితరులు పాల్గొన్నారు.