గ్రావెల్ అక్రమ తోలకాలపై ఉక్కు పాదం.. తాహసిల్దార్ భరణి బాబు

చర్ల డిసెంబర్ 17 (నిజం న్యూస్) మండలం లోని లక్ష్మి కాలనీ సమీపంలో క్రీడా మైదానం లో జెసిబి ల ద్వారా త్రవ్వకాలు జరిపి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఒక జెసిబి నీ శనివారం తాసిల్దార్ బి భరణి బాబు రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకొని కార్యాలయానికి తరలించారు వారిపై నాన్ బుయిల్ బుల్ కేసులు నమోదు చేసినట్లు తాసిల్దార్ బి భరణి బాబు తెలిపారు