Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని  విచారణకు వచ్చిన అధికారుల హామీ..

మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని

విచారణకు వచ్చిన అధికారుల హామీ..

 

ఇటీవల మైనార్టీ గురుకులాలలో ఉన్న సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా..

? హుజూర్నగర్ ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న సమస్యలపై ఇటీవల ఉన్నతాధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు తెలియజేయడం జరిగిన విషయం విధితమే..

అందులో భాగంగా ఈరోజు శనివారం విచారణకు..

♦️తెలంగాణ ముస్లిం మైనార్టీ గురుకులాల *రాష్ట్ర సొసైటీ అసిస్టెంట్ సెక్రెటరీ మహమ్మద్ ఫరీదుద్దీన్,మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా (R. L. C) రీజనల్ కోఆర్డినేటర్ విష్ణు గౌడ్*

గార్లు హుజూర్నగర్ విచ్చేసి ముస్లిం మైనార్టీ పెద్దలను నాయకులను సమావేశం అయినారు అధికారులు అలాగే మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ను మరియు తల్లిదండ్రులను గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను

అడిగి తెలుసుకున్నారు అధికారులు..

 

? ఈ *సందర్భంగా ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి అజీజ్ పాషా వచ్చిన అధికారులతో మాట్లాడుతూ* ..

 

? విద్యార్థులకు అందించవలసిన ఆహారంలో నాణ్యత లోపించిందని దీనితో విద్యార్థులు అనారోగ్యాలు పాలవుతున్నారని అలాగే అందులో ఆరో వాటర్ ప్లాంట్ చెడిపోవడంతో విద్యార్థులకు త్రాగే మంచినీటికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందని బోర్ వాటర్ తాగడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని

అలాగే ఇందులో కొంతమంది సిబ్బంది విద్యార్థుల పట్టా తల్లిదండ్రుల పట్టా దురుస్తానంగా ప్రవర్తిస్తున్నారని

అలాగే విద్యార్థులకు నూతనంగా వచ్చిన బంకర్ కార్డ్స్ నేటి వరకు ఫిటింగ్ చేయలేదని దీనితో కొంతమంది విద్యార్థులు నేలపై పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొంతమంది అందులో పని చేసే కొంతమంది

తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వచ్చిన అధికారులకు ఎండి అజిజ్ పాషా తెలియజేయడం జరిగింది..

? విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి అలాగే ఉన్నత అధికారుల పర్యవేక్షణ విసిటింగ్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహించకుండా మీరు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు

? విచారణకు వచ్చిన అధికారులు సమస్యలను పూర్తిస్థాయిలో విన్న అధికారులు 15 రోజులలో మైనార్టీ గురుకులాలు లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..

*ఈ కార్యక్రమంలో ముస్లిం* పెద్దలు మరియు నాయకులు నవాబ్ జాని, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ గౌస్ ఖాన్, ఎస్.కె రసూల్, ఎస్కే ముస్తఫా, సిరాజ్, భాష, రహీం తదితరులు పాల్గొన్నారు..