గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం

జిన్నారం డిసెంబర్ 17 (నిజం న్యూస్)
సంగారెడ్డి జిల్లా జన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం కలకలం రేపింది హెటిలో పారిశ్రమంలోని హెచ్ బ్లాక్ లో చిరుత దిగి ఉండడంతో టెన్షన్ నెలకొంది తెల్లవారుజామున 4 గంటలకు కంపెనీలోకి చిరుత ప్రవేశించినట్లు తెలిసింది పరిశ్రమంలోని సిసి కెమెరాలో చిరుత సంచారం దృశ్యాలు రికార్డు అయ్యాయి చిరుత సంచారం గురించి పారిశ్రామిక సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు అటవీ శాఖ సిబ్బంది హెచ్ బ్లాక్ కు చేరుకొని చిరుతను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు పరిశ్రమలోకి ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది ఎవరిని అనుమతించడం లేదు చిరుత సంచారం నేపథ్యంలో హెటిరో పరిశ్రమ కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కార్మికులు కోరుతున్నారు