Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కేసీఆర్ స్ఫూర్తితో…. యువరైతు సురేష్ యాదవ్

విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే డాక్టర్. గాదరి కిషోర్ కుమార్ కృషి సహకారంతో…. డ్రాగన్ ఫ్రూట్ తోటలో రాణిస్తున్న….. యువరైతు.

తుంగతుర్తి డిసెంబర్ 17 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో రైతులకు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తూ వ్యవసాయ రంగంతోపాటు, ఉద్యానవనాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో యువ రైతులను ప్రోత్సహిస్తుండంతో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం చెందిన యువరైతు సురేష్ యాదవ్, తనకున్న భూమిలో కష్టపడుతూ, తనదైన శైలిలో రాణిస్తూ, రెండు ఎకరాల పైగా డ్రాగన్ ఫ్రూట్ తోటలో సాగులో రాణించి, లాభాలను ఆర్జిస్తున్నాడు.

 

జాజిరెడ్డిగూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామానికి చెందిన యువరైతు సురేష్ యాదవ్ మొదట కర్ణాటక నుండి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలను ఒక్కొక్కటి 40 రూపాయల చొప్పున, తీసుకువచ్చి చుట్టూ కనీలను ఏర్పాటు చేసి, ఒక్కొక్క చెట్టును పెట్టి, పూర్తిస్థాయిలో పందిరి వేసి, సమయానుకూలంగా నీటిని పెట్టుతూ, మందులను పిచికారి చేస్తూ డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నాడు. మొత్తం ఖర్చులు సుమారు10 లక్షల పైగా వెచ్చించి సాగులో రాణిస్తున్నాడు.

 

రెండవ సంవత్సరంలో కొన్ని మొక్కలను స్థానిక నర్సరీ ద్వారా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా సురేష్ యాదవ్ చిన్న తన నుండి ఒక ప్రక్క తోటలో రాణిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో తాను ప్రత్యేకమైన డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సిద్ధమైనట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన యువ నాయకుడునియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో , ఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో కూడా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలుపుతూ… సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని, యువ రైతులు కష్టపడి ముందుకు రావాలని ముఖ్యమంత్రి స్వయంగా తెలపడం నాలోని విశ్వాసం పెంచిందని, ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ మంచి డిమాండ్ ఉండడంతో ఒక్కొక్క కేజీకి 150 నుంచి రెండు వందల రూపాయలు ధర పలుకుతుందని, ఖర్చు లు పోగా రెండెకరాలలో సుమారు రెండు లక్షల సంపాదిస్తున్నట్లు, రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా కొంతమంది రైతులకు అవగాహన కల్పించడంతో డ్రాగన్ ఫ్రూట్ సాగుపై, తనకు ప్రశంస పత్రాన్ని పొందినట్లు తెలిపారు. ఎవరికైనా తోటపై సలహాలు ,సూచనలు కావాలంటే తాను తప్పనిసరిగా తెలియపరస్తానని, ఆనందం వ్యక్తం చేశారు.

యువరైతు సురేష్ యాదవ్ డ్రాగన్ ఫ్రూట్స్ సాగు తీసుకున్న నిర్ణయం పట్ల ఈ ప్రాంత రైతులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.