యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

యదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో డిసెంబర్ 17(నిజం న్యూస్)
శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహా స్వామి వారి దివ్య దేవాలయం లో మహా మహనీయమైన ఉత్సవం, శ్రీ వ్రతమైన ధనుర్మాస ఉత్సవం శుక్రవారం సాయంత్రం వైభవోపేతముగా ప్రారంభం అయ్యాయి. నూతన దేవాలయములో మొదటి సారిగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని దేవాలయములో ఉత్తర మంటపాన్ని సుందరముగా ఏర్పాటు చేసి దేవాలయంలో 30 రోజుల పాటు జరిపించు ధనుర్మాస ఉత్సవాన్ని కనులవిందుగా ప్రారంభించారు. ఆండాళ్ అమ్మ వారిని మంటపములో వేంచేపు చేసి ధనుర్మాస సేవాకాలాన్ని చేసినారు. ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహా చార్యులు ఈ మాస వైభవాన్ని ఈ ఉత్సవ ప్రాముఖ్యతను, మొదటి రోజు ఆండాళ్ అమ్మ వారికి విన్నవించు పాశుర అర్ధాన్ని తెలిపారు..ఇరువురు ప్రధానార్చకులు,ఉప ప్రధానార్చకులు,ప్రబంధ పరాయణదారు, అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు, సిబ్బంది అందరు కలిసి ఈ మహోత్సవాన్ని తిలకించి సేవించినారు..