ప్రకృతి పచ్చగా ఉంటే ….జీవితం నిండుగా ఉంటది

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన
– ఎమ్మెల్యే శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 16 నిజం న్యూస్
పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త హరిత ప్రేమికుడు రాజ్యసభ సభ్యులు గౌ.శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు దానికి బదులుగా తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ హైదరాబాద్ పట్టణంలోని తన నివాసంలో మొక్క నాటి ధన్యవాదాలు తెలియజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం ఉందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన చాలెంజ్ అని అన్నారు. మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల నేలతల్లికి, అలాగే మానవ సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు.