సూర్యాపేటలో పోలీసు వాహనమే మాయం

బుధవార అర్ధరాత్రి పెట్రోలింగ చేస్తుండగా… చోరీ జరిగినట్లు సమాచారం.
సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్ 15 నిజం న్యూస్
సూర్యాపేటలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు వాహనాన్ని అపహరించుకొని పోయిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు …..కొత్త బస్టాండ్ వద్ద కొత్త బస్టాండ్ వద్ద తనిఖీలు చేస్తున్న సందర్భంలో, గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అపరించకపోయినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రజా శ్రేయస్సు దుష్ట అహర్నిశలు రక్షణ చేస్తున్న పోలీసు వాహనం చోరీకి గురికావడం, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా చెప్పవచ్చు. జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిర్లక్ష్యం వాయించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజల డిమాండ్ చేస్తున్నారు.