అదనపు జిల్లా కోర్టు ను ఏర్పాటు చేయుటకు భవన పరిశీలన

హుజూర్ నగర్ కు ఇటీవల మంజూరీ కాబడిన అదనపు జిల్లా కోర్టు ను ఏర్పాటు చేయుటకు స్థానిక కోర్టు భవన సముదాయం లో అనువైన భవనాన్ని పరిశీలించి, ఎంపిక చేయుట కొరకు సూర్యపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతమ్ ప్రసాద్ బుధవారం హుజూర్ నగర్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు భవనాన్ని కలియ తిరిగి స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఆర్ అండ్ బి అధికారులతో చర్చించారు. నూతన కోర్టు ఏర్పాటు భవనాన్ని ఎంపిక చేసి నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్, జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి, న్యాయవాదులు నారపరాజు శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసరావు, నట్టే సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్ రెడ్డి, కుక్కడపు బాలకృష్ణ, చనగాని యాదగిరి, రవికుమార్, ప్రవీణ్ కుమార్, అంజయ్య, రమణారెడ్డి, సైదా హుస్సేన్, వెంకయ్య, వీరయ్య, ధూళిపాల శ్రీనివాసరావు, కొట్టు సురేష్, రామ లక్ష్మారెడ్డి, చంద్రయ్య, వి జి కే మూర్తి, ప్రశాంత్, సురేష్ నాయక్, వెంకటేష్ నాయక్, నారాయణరెడ్డి, సైదులు, మహేష్, జుట్టుకొండ సత్యనారాయణ, రామినేని వెంకటేశ్వర్లు, సీఐ రామలింగారెడ్డి, న్యాయశాఖ సిబ్బంది, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు.