బయన్న రిజర్వాయర్ లో చేప పిల్లలు వదిలిన నాయకులు

జనగాం కొడకండ్ల డిసెంబర్13(నిజం న్యూస్)
జనగాం జిల్లా కొడకండ్ల మండలం లో కల బయన్నా రిజర్వాయర్ లో తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ డైరెక్టర్ దళిత రత్న అందే యాకాయ్య సర్పంచ్ పసునూరి మధుసూధన్ మరియు బిఆర్ఎస్ మండల నాయకులు ప్రభుత్వం అందించిన చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలారు. అందే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా స్వరాష్ట్రం సిద్దించాక పల్లెలన్నీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి అంటే ఇదంతా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ అని అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు ఎంపిటిసి లు వార్డ్ సభ్యులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు