జేఎల్ నోటిఫికేషన్ దృష్ట్యా పీజీ ప్రథమ, నాలుగోవ సెమిస్టరు ఫలితాలు విడుదల చేయాలి

వరంగల్ డిసెంబర్ 13 నిజం న్యూస్ : కాకతీయ యూనివర్సిటీ బిఎస్ఎఫ్,
డిఏంఎస్ఏ విధ్యార్ది సంఘాల ఆధ్వర్యంలో
ఇటీవల టీఎస్ పి ఎస్ సి నోటిఫికేషన్ విడుదల అయినా సందర్బంగా జూనియర్ లెక్చరర్ ( జేఎల్) నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి కాని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రథమ సెమిస్టర్, చివరి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు ఇంకా రానందున ఆ పరీక్ష ఫలితాలు విడుదల కొరకై కాకతీయ విశ్వవిద్యాలయం అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జ్యోతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా విధ్యార్ది నాయకులు మాట్లాడుతూ
జెఎల్ నోటిఫికేషన్ విడుదులైన సందర్బంగా సెప్టెంబర్ నెలలో ప్రథమ,నాలుగవ సెమిస్టరు రాసిన విద్యార్థులకు వెంటనే ఫలితాలు విడుదల చేయాలనీ ఫలితాలు ఆలస్యం చేయడం వల్ల విద్యార్ధులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అందువల్ల వెంటనే నాలుగో సెమిస్టరు ఫలితాలు విడుదల చేయాలనీ,విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.విద్యార్థి సంఘాల నాయకులు బిఎస్ఎఫ్ కేయూ ప్రెసిడెంట్ కళ్లేపల్లి ప్రశాంత్,డిఏం ఎస్ ఏ జిల్లా అధ్యక్షులు బొట్ల తేజ, అశోక్, రోహిత్, నాగరాజు, మల్లేష్, కళ్యాణి, స్రవంతి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.