Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.

-పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్, మెస్, కాస్మోటిక్ చార్జీల ను తక్షణమే విడుదల చేయాలి.
-పి.డి.ఎస్.యు.తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు.
-పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకువిద్యార్థుల ర్యాలీ, కలెక్టరేట్ ముందు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేత.
వరంగల్ డిసెంబర్ 13 నిజం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల కేసీఆర్ పాలనలో విద్యారంగా అభివృద్ధి విద్యార్థుల సంక్షేమం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవటమే కాకుండా విద్య వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టి పోతున్నదని పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ప్రగతి ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ లోని సుబేదారిలో గల యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడించి, గంటసేపు ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతుకి ప్రతినిధి బృందంగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి.డి. ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అలువాల నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ వర్గాల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత సంవత్సరంన్నర కాలంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తూన్నారని తెలిపారు. పెరిగిన ధరలకనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచకపోవడంతో నాణ్యమైన రుచికరమైన భోజనం లభించక పురుగుల అన్నం,నీళ్ల చారే దిక్కవుతున్నదని దీంతో హాస్టల్ విద్యార్థులు స్పర్శ జ్ఞానం కోల్పోయి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు గురికావాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగభివృద్ధి , పేద విద్యార్థుల సంక్షేమం పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ,తక్షణమే పెండింగ్ లో ఉన్న 3,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పెరిగిన ధరల కనుగుణంగా విద్యార్థుల స్కాలర్షిప్ నెలకు 3వేలు, మెస్ చార్జీలు నెలకు 3000, కాస్మోటిక్ చార్జీలు నెలకు 500 రూపాయల చొప్పున పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ మరియు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ కు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని, పేద మధ్యతరగతి వర్గాలను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే కుట్రలకు స్వస్తి పలికి పెంచిన ఇంజనీరింగ్ ఫీజులన్నింటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేసి కెసిఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యక్షులు ఎ.ప్రవీణ్, జిల్లా నాయకులు దీపక్, వినయ్, సాయి చరణ్, మహేందర్, సాయి చరణ్, విక్టర్, దీక్షిత్ ,గణేష్ ,సిద్ధార్థ ,శ్రీకాంత్, లక్ష్మణ్, సంజయ్, అభిలాష్, అభిరామ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.