అక్రమంగా తరలిపోతున్న బియ్యం

పట్టించుకోని జిల్లా అధికారులు మండల అధికారులు.
అధికారుల చేతివాటంతో జోరుగా సాగుతున్న బియ్యం దందా
మధ్య దళారులకు అమ్ముకుంటున్న వైనం
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసెంబర్ 13 నిజం న్యూస్
చిట్యాల మండలాలలో నిరుపేదలకు అందవలసిన రేషన్ బియ్యాన్ని వారికి అందకుండా నోటికాడ బుక్కును లాక్కొని మధ్య దళారి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇతర రాష్ట్రాలకు బియ్యం వ్యాపారులు బియ్యాన్ని తరలిస్తున్నారు ఈ దంద మూడు పువ్వులు ఆరు కాయలు కాస్త ఉంది మండల అధికారుల నుండిమొదలుకొని జిల్లా అధికారుల వరకు బియ్యం దందా చేసే వారికి సహాయ సహకారంగా ఉంటున్నారు వాళ్ళిచ్చే ముడుపులకు ఆశపడి నిరుపేదల నోట్లో మట్టి పోస్తున్నారు ఈ దందాను అరికట్టవలసిన వారే కంచె చేను మేసే చందంగా ఉంది ఇలాంటి అధికారుల పైన క్రిమినల్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరు రూపాయల కిలో నిరుపేదల దగ్గర నుంచి కొనుగోలు చేసి పది రూపాయలు కిలో అమ్ముకుంటున్నారు బియ్యం దందా చేసేవారు ఇతర రాష్ట్రాలలో 20 రూపాయల కిలో అమ్ముకుంటున్నారు ఆరు కాలం కష్టం చేసిన నిరుపేదలు మాత్రం ఆకలి చావులు చస్తున్నారు బియ్యం దందా చేస్తున్న వారి పైన ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు ఎందుకంటే వారి వాటా వారికి అందుతుంది కాబట్టి బియ్యం దండ చేసేవారు గ్రామాలలో దిగబడి తక్కువ రేటుకు బియ్యం కొనుగోలు చేసి అర్ధరాత్రి రెండు తర్వాత లారీలల్లో ఎగుమతి చేసుకొని బియ్యాన్ని తరలిస్తున్నారు వీరు పైన కేసులు నమోదు చేసి ఈ దందా ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాము మండలంలో బియ్యం దందా చేసేవారు స్వేచ్ఛగా చేస్తున్నారు వారి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు సన్న బియ్యం మార్కెట్లో కొనాలంటే 50 రూపాయలు పలుకుతుంది కాయకష్టం చేసే నిరుపేద వాళ్ళు సన్న బియ్యం కొని తినలేని పరిస్థితిలో ఉన్నారు ఉన్న దొడ్డు బియ్యం అయినా వండుకొని తిని కాయకష్టం చేసుకుంటున్నారు. అలాంటి నిరుపేదల కడుపు కొడుతున్న వారి పైన చర్యలు తీసుకోకుండా ఎందుకు చోద్యం చేస్తున్నారు తక్షణమే దందాను అరికట్టాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు ఆకునూరు జగన్ నియోజకవర్గ కార్యదర్శి కసర వేణు కుమార్ సంగిరాజు పాల్గొన్నారు