Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సమస్యలతో సతమతమవుతున్న హన్మకొండ

వరంగల్ జిల్లా నిజం న్యూస్ డిసెంబర్ 13

హన్మకొండ, స్థానిక సమస్యలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. మంగళవారం 49 వ డివిజన్ రేవెన్యూ కాలనీ లో స్థానిక సమస్యలపై సీపీఎం హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీపీఎం జిల్లా కమిటీ పీలుపులో భాగంగా స్థానిక సమస్యల పై సేర్వే నిర్వహించడం జరుగుతుంది. గత 20 సం.రాలుగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని దానికి ఈ ప్రభుత్వల పనితిరే కారణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి పేరు తో సం రానికి 350 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నమని చెప్తున్న కానీ రోడ్డు, డ్రైనేజి, పారిశుద్ధ్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోందన్నారు. ఇంటి నంబర్లు పేరుతో, పన్నుల పేరుతో, మున్సిపాలిటీ ఆదాయాన్ని సమకూర్చుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఈ రోజు సర్వే భాగంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ డ్రైనేజి వ్యవస్థ, రోడ్లు, మున్సిపాలిటీ మంచినీరు లీకేజీ తదితర సమస్యలపై ఇబ్బందులు పడుతున్న పట్టిచుకునేవారు లేరని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ కనీసం కాలనీల్లో సందర్శించే పరిస్థితి లేదన్నారు. అలానే ఈ సమస్యలపై మున్సిపాలిటీ అధికారులకు దరఖాస్తులు చేసిన సమస్యలు పరిష్కరం కాలేదన్నారు. ఈ సమస్యలపై ఈ నేల 19 న జిడబ్ల్యూఎంసీ ముందు ధర్నా ఉందని ఈ సమస్యలు పరిష్కారానికి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నోముల కిషోర్, పార్టీ సభ్యులు సప్పిడి మనోహర్, మోతె సతీష్, రాంఖి, స్రవంతి, శ్వేతా, విజయ్, జంపన్న, అనిల్, యువన్, శివాని, శైలజ, యేసు, పవన్, యుగేందర్, కవిత తదితరులు పాల్గొన్నారు.