ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

-అమ్మాపురం సర్పంచ్ కడెం యాకయ్య
తొర్రూరు నిజం న్యూస్ డిసెంబర్ 13
గ్రామీణ ప్రాంతాలలో ఉచితంగా చేపడుతున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అమ్మాపూరం సర్పంచ్ కడెం యాకయ్య అన్నారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో బేడ బుడగ జంగం కొత్త పంచాయతీ గడ్డ వద్ద మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బిబిజె హిందు సేవా సమితి సహకారంతో మంగళవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఎండి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చేతన్ రెడ్డి, డాక్టర్ శివ లు బిపి, షుగర్, హార్ట్ బీట్,పల్స్ రీడింగ్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మెడికేర్ హాస్పిటల్ నిర్వాహకులు ఉచితంగా వైద్య శిబిరాలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గ్రామస్తులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నరుకుటి రాము,రాజేష్,కిరణ్, హాస్పిటల్ బృందం కవిత,రాము, శృతి, సుమతి, హిందూ సేవా సమితి అధ్యక్షుడు సిరిపాటి వెంకటేష్,ఉపాధ్యక్షుడు కిన్నెర శివాజీ, ప్రధాన కార్యదర్శి సిరిపాటి విశాల్, ఉప కార్యదర్శి తూర్పాటి భరత్, కోశాధికారులు పస్తం రాజు, గంధం మహేందర్,కళ్యాణి శ్రీనివాసులు,కిన్నెర రాజ్ కుమార్, సభ్యులు ఇస్లాంపూర్ యాకయ్య, కళ్యాణి సైదులు,పస్తం రామ్మూర్తి, కర్రె జ్ఞానేశ్వర్,కడెం శ్రీనివాస్,పస్తం శ్రీనివాస్,గంధం అశోక్, కిన్నెర అశోక్, కిన్నెర గణేష్ తదితరులు పాల్గొన్నారు.