Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టిడబ్ల్యూజేఏ తొర్రూరు డివిజన్ కమిటీ ఎన్నిక

తొర్రూరు నిజం న్యూస్ డిసెంబర్ 13

ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిడబ్ల్యూజేఏ) తొర్రూరు రెవెన్యూ డివిజన్ నూతన కమిటీని రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టిడబ్ల్యూజేఏ జిల్లా గౌరవ అధ్యక్షులు లావుడియా రాము నాయక్ ప్రకటించారు. గూడూరు మండలం సీతానగరం భీముని జలపాతం వద్ద జరిగిన ట్రైబల్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ కమిటీ నియామకం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.తొర్రూరు డివిజన్ అధ్యక్షులుగా దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామ శివారు తూర్పు తండ గ్రామపంచాయతీ కి చెందిన గుగులోత్ జుంకీలాల్ నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శిగా నర్సింహుల పేట మండలం కొమ్ములవంచ గ్రామ శివారు రూప్లో తండా గ్రామపంచాయతీ పరిధిలోని మధు తండా చెందిన గుగులోతు లింగ్య నాయక్ లను ఏకగ్రీవంగా నియమించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా 33 గిరిజన తెగల జర్నలిస్టుల సంక్షేమం కోసం పహార్నిశలుగా కృషి చేస్తున్నామని,ట్రైబల్ జర్నలిస్టుల కోసం జరిగే ప్రతి పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నందున వారి సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు జూమ్కీలాల్, లింగ్య నాయక్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను వమ్ము చేయకుండా బాధ్యతయుతంగా నడుచుకుంటు, ట్రైబల్ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తమ వంతు బాధ్యతగా ఉద్యమిస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు తేజావత్ రవి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు లక్ష్మణ్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు శ్రీనివాస్ నాయక్, జిల్లా కార్యదర్శి లకావత్ యాదగిరి నాయక్, లీగల్ అడ్వైజర్ మోహన్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ నాయక్, పొనుగొత్ బాలాజీ నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి భూక్య యువరాజు నాయక్, జిల్లా కోశాధికారి తేజావత్ ప్రమోద్ నాయక్, రాష్ట్ర నాయకులు భానోత్ వెంకన్న నాయక్, బాలు నాయక్, లతోపాటు జిల్లా రాష్ట్ర నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియామకం పట్ల తండావాసులు, గ్రామస్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.