Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

 ముస్లిం మైనారిటీల12/శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్లో బి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు..?

*ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఢిల్లీలో ఆందోళన చేపట్టాలి*

? కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ముస్లింలకి మీరిచ్చిన12 శాతం రిజర్వేషన్ల వాగ్దానాన్ని అమలు చేయాలి..

? అప్పుడు కెసిఆర్ గారు ముస్లింలకు అనేక హామీలు ఇచ్చారు..

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకొచ్చి 8 సంవత్సరాలు అయ్యిందని కానీ హామీలు మాత్రం అమలు జరగలేదని

మంగళవారం జరిగిన ముస్లిం మైనార్టీల సమావేశంలో

? *రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ అజీజ్ పాషా..*

ఈ *సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

? మీరు ఏర్పాటు చేసిన సుధీర్ కమిటీ నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం ఉన్న ముస్లిం మైనార్టీల స్థితిగతులు అందులో 85/ శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నరని విద్యా, ఉద్యోగ,ఉపాధి, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుతనానికి గురి అవుతున్నారని ఈ రాష్ట్రంలో దళితుల కంటే దయనీయ స్థితిలో జీవనములు కొనసాగిస్తున్నారని

ఈ నివేదికలో పేర్కొనడం జరిగిందని ఆయన అన్నారు..

♨️రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములకు

తిరిగి స్వాధీనం చేసుకోవడానికి

వక్ఫ్ బోర్డు కి జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామని కోట్లాది రూపాయల విలువైన వక్స్ భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు ఇంతవరకు మీరు దీనిని అమలు చేయలేదు..

?రాష్ట్రంలో ముస్లింల కమ్యూనిటీ పై జరుగుతున్న అన్యాయాలపై తమ సమస్యలను చెప్పుకోవడానికి ఫిర్యాదులు చేయడానికి ఇంతవరకు *స్టేట్ మైనార్టీ కమీషనర్ ను కూడా ఏర్పాటు చేయలేదు..*

♨️ అధికారంలోకి రాగానే ఉర్దూ భాష కి రెండవ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు కానీ నేటివరకు అదీ జరగలేదు..

? మీరు నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉండగా అందులో ఏ ఒక్కరికి ముస్లిం మైనార్టీ కూడా సభ్యులుగా తీసుకోలేదు..

♨️అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్శిటీలో మీరు నియమించిన ఛాన్స్లర్స్, వైస్ ఛాన్స్ లర్ల లొ ఒక్క ముస్లిం మైనారిటీ కి కూడా అవకాశం కల్పించలేదు…

? *కెసిఆర్  అధికారంలోకి రావటానికి ముస్లింలకు 12.శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 8 సంవత్సరాలు దాటినది రెండుసార్లు అధికారం అనుభవిస్తున్నారు.*

♨️ *తమరు కేంద్ర ప్రభుత్వం నికి రిజర్వేషన్లు అమలు నివేదిక సమర్పించి ఎన్ని సంవత్సరాలు అయినది.కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఢిల్లీలో సునామి సృష్టిస్త..* *జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తామని కెసిఆర్ గారు అన్నారు కానీ నేటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్ల విషయం ఏమైందో అని ఏనాడు అడగటం గానీ ప్రశ్నించటం గానీ ముస్లింల పక్షాన పోరాటం చెయ్యటం గానీ జరగలేదని ఆయన అన్నారు*

? *కెసిఆర్ గారు మీకు నిజంగా ముస్లిం మైనార్టీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మీరు మీ పార్టీ ఎంపీలతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో ఈ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రిగా మీరు ఢిల్లీలో రిజర్వేషన్లు అమలు జరిగే వరకు ఆందోళన చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నీ డిమాండ్ చేశారు..*

*ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు* మహమ్మద్ గౌస్ ఖాన్, ఎస్.కె రసూల్, ఎండి. సిరాజ్, షేక్. అహ్మద్, షేక్. రషీద్, మున్నా, రజాక్, అబ్దుల్ అజీజ్, రియాజ్, జానీ, భాష, సత్తార్ తదితరులు పాల్గొన్నారు..